పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా సారవకోట మండలంలో జరుగుతున్న రోడ్డు పనులను వేగవంతం చేయాలని ఎంపీపీ కూర్మినాయుడు అధికారులకు సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో మోహన్ కుమార్, ఇతర సిబ్బందితో గురువారం ఆయన సమీక్షించారు. మండలంలోని చాలా గ్రామాల్లో రోడ్డు పనులు జరుగుతున్నాయని చెప్పారు. వాటిని సకాలంలో పూర్తి చేయించాలని ఆయన అధికారులను కోరారు.