శ్రీకాకుళం: పడవ పైనుండి జారిపడి మత్స్యకారుడు మృతి

60చూసినవారు
శ్రీకాకుళం: పడవ పైనుండి జారిపడి మత్స్యకారుడు మృతి
శ్రీకాకుళం రూరల్ మండలం గనగళ్ళవానిపేట వద్ద వంశధార నదిలో పడవ పై నుండి పడి మత్స్యకారుడు మృతి చెందిన ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే గనగళ్ళవానిపేట గ్రామానికి చెందిన పుక్కళ్ళ గణేష్ (40) ఆదివారం చేపల వేటకు వెళ్లి నదిలోకి వల విసిరాడు. వలకు చెందిన తాడు చేతికి కట్టుకుని ఉండడంతో వల లాగి వెయ్యడంతో నదిలో జారిపడ్డాడు. బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా వల కమ్ముకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్