ప్రభుత్వ ఆదేశాల మేరకు జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం రేపటి నుంచి అమలు కానుంది. జిల్లాలో 38 జూనియర్ కళాశాలలో 11028 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే వీరిలో 1787 మంది వసతి గృహల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే మధ్యాహ్న భోజనం అమలు చేయడం లేదని డీవీ ఈఓ తవిటి నాయుడు శుక్రవారం తెలిపారు. అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనం అందిస్తామని ఆయన చెప్పారు.