జలుమూరు మండలంలోని అందవరం, దొంపాక, పర్లాం ఇసుక ర్యాంపుల పరిధిలో వంశధార నది నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 8 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నామని తహసిల్దార్ జె రామారావు తెలిపారు. బుధవారం సాయంత్రం జలుమూరు మండల కూడలి వద్ద వీటిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పలువురిపై కేసులు నమోదు చేశామని వివరించారు.