కుష్టు వ్యాధిగ్రస్తులను, నిరుపేద కుటుంబాలకు చెందిన దివ్యాంగులకు స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాలని శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి తెలిపారు. బుధవారం నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక లెప్రసీ కాలనీ లో స్థానిక లెప్రసీ, వికలాంగులకు స్వచ్ఛంద సంస్థ దుప్పట్లను వితరణగా అందజేసింది. ఈ క్రమంలో ఆయన వాటిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా కుటుంబాలను ఆదుకునేందుకుగాను ప్రభుత్వ కృషి చేస్తుందన్నారు.