ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని పూజించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. నర్సన్నపేటలోని కార్యాలయంలో శుక్రవారం మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మట్టి వినాయకులను పూజించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడంతోపాటు ప్రమాదకరమైన రసాయనాల నుండి రక్షణ పొందడం జరుగుతుందన్నారు. అనంతరం నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.