పాలకొండలో అగ్నిమాపక అమరవీరుల దినోత్సవం

78చూసినవారు
పాలకొండలో అగ్నిమాపక అమరవీరుల దినోత్సవం
పాలకొండ అగ్నిమాపక కేంద్రం వద్ద సోమవారం జాతీయ అగ్నిమాపక అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు, సిబ్బంది పాల్గొని విధిలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. బీహార్‌కు చెందిన సీనియర్ ఫైర్‌ఫైటర్ రవికాంత్ మండల్, ముంబయి ఓడరేవులో నౌక అగ్నిప్రమాదంలో మరణించిన 231 మంది అమరవీరులను స్మరించుకున్నారు. దేశ రక్షణలో అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న సేవలు అప్రతిమమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్