వీరఘట్టం: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

51చూసినవారు
వీరఘట్టం: గుర్తు తెలియని మృతదేహం లభ్యం
పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం వట్టి గూడ గ్రామం వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం అయిందని ఎస్సై కళాధర్ తెలిపారు. గురువారం ఉదయం మృతదేహం సమాచారాన్ని స్థానికులు పోలీసులకు అందజేశారని వివరించారు. అయితే మృతుడు ఎలా చనిపోయాడో తెలియ రావలసి ఉందని ఆయన వివరించారు. మృతుని వివరాలు తెలిస్తే సమాచారం అందించాలని ఆయన కోరారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్