రైస్ మిల్లు యాజమాన్యాలు రైతులకు చేస్తున్న అక్రమాలు అరికట్టాలని డిమాండ్ చేస్తూ మందసలో గురువారం జీడి, రైస్ మిల్లు కార్మికులు, సీఐటీయూ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి తహసిల్దార్ హైమావతికి వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్. గణపతి మాట్లాడుతూ. రైస్ మిల్లు కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కారించాలని డిమాండ్ చేశారు. ధాన్యంలో తేమ పేరుతో అదనపు తూకం అరికట్టాలి అన్నారు.