పలాస ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో 1987_88 పదవ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దాట్ల దాశరధి హాజరయ్యారు. సుమారు 110 మంది విద్యార్థులు కలుసుకొని పాత రోజులు గుర్తు చేసుకుని సరదాగా గడిపారు. తమకు బోధించిన గురువులకు సన్మానము, స్వర్గస్తులైనటువంటి మిత్రులకు, గురువులకు శ్రద్ధాంజలి ఘటించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో రోజంతా సందడిగా గడిపారు.