ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మందస టిడిపి కార్యాలయంలో తెలుగుదేశం కూటమి నాయకులు గురువారం సంబరాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సీఎం చంద్రబాబు పరిపాలనతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పరిపాలనలో నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని అన్నారు.