శ్రీకాకుళం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు సతిసమేతంగా దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏడాది రథసప్తమి రోజున ఆలయానికి రావడం సాంప్రదాయంగా తనకు కొనసాగుతుందని పేర్కొన్నారు. స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు.