మందస: సెంటర్ లైటింగ్ ఏర్పాటు

81చూసినవారు
మందస మెయిన్ రోడ్ లో బుధవారం సెంటర్ లైటింగ్ పనులు నిర్వహించారు. పాత తహశీల్దార్ కార్యాలయం నుండి వాసుదేవ ఆలయం వరకు పలుచోట్ల వీధి దీపాలు లేక సమస్య ఏర్పడిందని ఇటీవల జనసేన నాయకులు సంతోష్ పండా తో సహా పలువురు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే చొరవతో అధికారులు రహదారి మధ్యలో సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు జన సైనికులు, మందస యువత ఎమ్మెల్యే గౌతు శిరీషకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్