ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్లాటినం జూబ్లీ (75) జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని.. తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం పలాసలో టిడిపి ఎమ్మెల్యే గౌతు శిరీష క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బి.వి.రామ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పరిపాలనలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకెళుతున్నారన్నారు.