జిల్లుండ: ఉగ్రదాడిని ఖండిస్తూ ర్యాలీ

51చూసినవారు
భారతదేశంలో హిందువులపై దాడి పిరికిపంద చర్య అని పలువురు వక్తలు వాపోయారు. మంగళవారం రాత్రి మందస మండలం జిల్లుండ గ్రామంలో శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పెహల్గామ్ లో హిందువులపై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. ఉగ్రవాదం నశించాలి, భారత్ మాతాకి జై, జై జవాన్ అంటూ పలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ సేవా సమితి సభ్యులు, స్థానిక యువత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్