పలాస మండలం మహదేవుపురానికి చెందిన రామారావు, తన బావమరిది గోకర్ల చంద్రశేఖర్ భార్య రాజేశ్వరితో (23) వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఈ విషయం తెలిసిన ఎదురింటి ఈశ్వరరావు, ఆమెతో సంబంధం పెట్టుకోవాలని ప్రయత్నించాడు. దీంతో కోపంతో మే 17న జీడితోటలో మద్యం తాగిన సమయంలో రామారావు, ఈశ్వరరావును హత్య చేశాడు. పోలీసులు కేసు ఛేదించి రామారావును అరెస్ట్ చేసినట్టు శుక్రవారం తెలిపారు.