కోటబొమ్మాళి మండలం పెద్ద హరిశ్చంద్రపురం గ్రామానికి చెందిన దుంపల దాలమ్మ (65) అనే వృద్ధురాలిని మంగళవారం ఉదయం ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు హత్యకు పాల్పడ్డారు. మృతురాలి భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందగా ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంటి పెరటి నుంచి ఇంట్లోకి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలోని బంగారం గొలుసు చోరీకి పాల్పడినట్లు తెలుస్తుంది.