మందస మండలం బుడార్సింగి పంచాయితీ కొరడాలు గ్రామంలో భారీ వర్షాలకు గిరిజనుడు నివాసగృహం కుప్పకూలిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. కొనక దమ్ము అనే గిరిజనుడికి గతంలో ఎన్టీఆర్ ఇల్లు మంజూరు చేయడం జరిగింది. అయితే పురాతన ఇల్లు కావడంతో భారీ వర్షాలకు గిరిజనుడు ఇల్లు కూలిపోవడం జరిగింది. దీంతో కొనక దమ్ము నిరాశ్రయుడయ్యాడు. ప్రభుత్వం ఆదుకొని కొత్త ఇల్లు మంజూరు చేయాలని ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్ చేసింది.