మందస మండల దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఇద్దరు కార్యనిర్వహణ అధికారులను నియమిస్తూ విజయవాడ దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి పది దేవాలయాలకు సంబంధించి ఎస్ నాగేశ్వరరావు, రెండవ 10 దేవాలయాలకు సిహెచ్ ప్రభాకర్ రావు లను నియమించారు. వీరు శ్రీముఖలింగం నుండి బదిలీపై రాగా, గతంలో ఎక్కడ విధులు నిర్వహించిన ఈవో వాసుదేవరావు శ్రీముఖలింగం బదిలీపై వెళ్లారు. నూతన ఈవోలు శనివారం బాధ్యతలు స్వీకరించారు.