అంతర్జాతీయ యోగా దినోత్సవంలొ గ్రామస్తుల్లో ఎక్కువ సంఖ్యలో పాల్గొనిస్తూ మొబైల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేపట్టి యోగా అవగాహనను విస్తృతం చేయాలని వెలుగు ఐటిడిఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ పిఈడి కూర్మారావు సూచించారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహనా ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, రోజూ యోగా చేస్తే పిల్లలు, వృద్ధులు, ముఖ్యంగా మహిళల్లో మానసిక ఒత్తిడి తగ్గి, సంపూర్ణ శారీరక–మానసిక ఆరోగ్యం పెరుగుతుందన్నారు.