మందస: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

69చూసినవారు
మందస: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మందస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మద్దిల సంపత్ రావు సూచించారు. గురువారం మందస గ్రామం కొత్త వీధిలో ఫ్యామిలీ ఫిజీషియన్ క్యాంప్ నిర్వహించారు. డోర్ టు డోర్ ఫీవర్ సర్వే నిర్వహించి పలువురు రోగులకు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. డెలివరీ కేసులను పీహెచ్సీ కు తీసుకురావాలని వైద్య సిబ్బందికి సూచించారు. వీధులలో గల బావులలో క్లోరినేషన్ చేయమని సిబ్బందికి సూచించారు.

సంబంధిత పోస్ట్