సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మందస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మద్దిల సంపత్ రావు సూచించారు. శుక్రవారం మందస పి హెచ్ సి లో సిబ్బందితో రివ్యూ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని ఏఎన్ఎంలు, ఆశలకు సూచించారు. గర్భిణీ స్త్రీలకు పిహెచ్సీకు తీసుకువచ్చి రక్త పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రజలకు, ఉపాధి హామీ పథకం పనులు నిర్వహించే వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయమన్నారు.