మందస పోలీసు స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలలో శుక్రవారం మందస పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు, మందస ఎస్సై కె కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి గంజాయి, మద్యం అక్రమ నిల్వలుపై సోదాలు నిర్వహించారు. పాత నేరస్తుల జీవన విధానం గురించి ఆరా తీసి ఎటువంటి వాహన పత్రాలు లేని పలు ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు.