ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సెర్ప్ సంస్థ ద్వారా గ్రామీణ ప్రాంతంలో పేద, మధ్యతరగతి,మహిళా సంఘ కుటుంబాల జీవనోపాదులను మెరుగుపరిచే ఉద్దేశంతోనే అదే గ్రామంలో స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్న విద్యావంతులు, ఉత్సాహవంతులు అయిన మహిళా ఎన్యుమరేటర్ల ద్వారా అన్ని సంఘాలకు వార్షిక క్రెడిట్ ప్లాన్ ను తయారు చేయిస్తున్నట్లు వెలుగు ఐటిడిఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ పైడి కూర్మారావు తెలిపారు. మంగళవారం మందస మండలం సరియాపల్లి పంచాయతీలో బంజీరు జగన్నాధపురం గ్రామంలో సంఘం వారి సభ్యురాల వారి ప్రతీ కుటుంబానికి తమ జీవనోపాదులను మెరుగుపరుచుకోవడానికి చేపట్టిన క్రెడిట్ ప్లాన్ తయారీను పరిశీలిస్తూ మాట్లాడారు.