మందస మండలంలోని సాబకోట, సింగుపురం గ్రామాల్లో ఉన్న శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానానికి చెందిన భూములను లీజుకు ఇచ్చేందుకు ఈ నెల 22వ తేదీ ఉదయం 11 గంటలకు జగన్నాథ స్వామి వారి దేవస్థానం వద్ద బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్య నిర్వహణ అధికారి టి. వాసుదేవరావు బుధవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి ఉన్నవారు రూ. 500 రూపాయలు ప్రధమ ధరావత్తు చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని సూచించారు.