మందస మండలంలోని సునాముది ఛానల్ పై డిమిరియా గ్రామంలో శిథిలావస్థలో ఉన్నటువంటి చెక్ డాం, షట్టర్ లను జనసేన పార్టీ సమన్వయకర్త దుర్గారావు, మండల పార్టీ అధ్యక్షులు కుప్పాయి గోపాలరావు, వజ్రపుకొత్తూరు క్లస్టర్ ఇన్ ఛార్జ్ దువ్వాడ వంశీకృష్ణ చౌదరి స్థానిక రైతులతో కలిసి శనివారం పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడితే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. మరమ్మత్తులు చేసి ఆయికట్టు రైతులకు సాగునీరు అందిస్తామన్నారు.