మందస మండలం పొత్తంగి గ్రామంలో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాశీ మోహన్ రావు (30) కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిస కావడం వలన తరచూ ఇంటిలో గొడవలు కావడం వలన మనస్థాపానికి గురై మోహన్ రావు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. మందస పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.