ప్రకృతిని కాపాడటానికి ప్రతీ ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని మందస మండలం కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ సేనాపతి దివ్యామురళి సూచించారు. బుధవారం కొత్తపల్లి గ్రామంలోని సచివాలయం, స్మశాన వాటిక పరిధిలో మర్రి, బాదం, కాము తదితర మొక్కలను స్థానిక కొత్తపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు చేతుల మీదుగా నాటి, వాటి పరిరక్షణ కోసం తగు ఏర్పాట్లు చేయడం జరిగింది. భవిష్యత్ లో గ్రామం చుట్టుప్రక్కల మరిన్ని మొక్కలు నాటనున్నట్లు ఈ సందర్బంగా తెలియజేసారు.