శాస్త్రీయ దృక్పథం ద్వారానే సమాజ అభివృద్ధి జరుగుతుందని పలువురు వక్తలు కొనియాడారు. మందస మండలం హరిపురంలో ఆదివారం ప్రజా విజ్ఞాన వేదిక నాయకులు మార్పు జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగిన విజ్ఞాన సదస్సుకు పిడిఎఫ్ పూర్వ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ, ప్రజా విజ్ఞాన వేదిక నాయకులు మట్ట ఖగేశ్వరరావు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ విశిష్ట అతిథులుగా హాజరై ఉపాధ్యాయులు అధ్యాపకులు, విద్యార్థులను ఉద్దేశించి జీవ పరిణామ క్రమము వివరించారు.