మందస మండలం హరిపురం బజారు వీధిలో గత కొంతకాలంగా పారిశుద్ధ్య సమస్య వేధిస్తుంది. బజారు వీధి సెల్ టవర్ ఆవరణలో డ్రైనేజీలో చెత్తాచెదారం పేరుకుపోయి డంపింగ్ యార్డ్ కంటే దారుణంగా తయారయిందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. మురుగునీటిపారుదల జరగక దుర్వాసన వెదజల్లుతుందని పరిసర ప్రాంత ప్రజలు వాపోతున్నారు. అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని పలువురు స్థానికులు కోరుతున్నారు.