మందస మండలం నారాయణపురం హైస్కూల్లో శనివారం జిల్లా స్థాయి గ్రూప్ టాలెంట్ టెస్ట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో మండలానికి చెందిన సాండిపూడి హైస్కూల్ చెందిన విద్యార్థులు రాణించారు. బాడ శ్రీజ, మట్ట హర్ష, జె నిహారిక, వై రూప్ కుమార్లు జిల్లా స్థాయి పోటీల్లో ద్వితీయ స్థానం సాధించారు. ఈ సందర్భంగా హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సుందర్ సాల్మన్ వీరిని అభినందించారు.