మందస: అధికారులు హాజరుకాని సమావేశాలు ఎందుకు?

80చూసినవారు
వివిధ శాఖల మండల అధికారులు పూర్తిస్థాయిలో హాజరుకాకపోతే, మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశాలు ఎందుకని వైస్ ఎంపీపీ సీర ప్రసాద్ ప్రశ్నించారు. బుధవారం మందస ఎంపీపీ డొక్కరి దానయ్య అధ్యక్షతన మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా వైస్ ఎంపీపీ సిర ప్రసాద్ మాట్లాడుతూ ఆర్ అండ్ బి అధికారులు ఒక్కసారి కూడా మండల పరిషత్ సమావేశాలకు హాజరు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మందస హరిపురం రోడ్డు గోతుల మయమై దారుణంగా ఉందని, ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్