విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కాశీబుగ్గ రూరల్ సీఐ ఎం. తిరుపతి రావు సూచించారు. 'సంకల్పం' కార్యక్రమంలో భాగంగా మందనలోని మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై సువర్ణపురం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.