కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదివారం శ్వేత పత్రం విడుదల చేశారు. గత ఏడాదిలో హామీలలో 70 శాతం పూర్తి చేశామని తెలిపారు. మాజీ మంత్రి అప్పలరాజు గత ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. 518 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.