ప్రజలకు మరింత అందుబాటులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కె. వి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణలో 12 వినతులు స్వీకరించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి పరిష్కారం అందిస్తామని భరోసా ఇచ్చారు. పరిసర ప్రాంత ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకోవాలని సూచించారు.