యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయమని టిడిపి నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి అన్నారు. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కాశీబుగ్గలోని సూర్య తేజ కళాశాలలో గురువారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ జాబ్ మేళాకు 15 ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించారు. 763 మంది ఇంటర్వ్యూలకు హాజరు కాగా 263 మంది వివిధ కంపెనీలకు ఎంపిక కాబడ్డారు.