మత్తు పదార్ధాలకు బానిసై యువత పెడదారిన పడకుండా బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దంటూ గ్రీన్ ఆర్మీ స్వచ్చంద సంస్థ పలాసలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. నిర్వాహకులు శనివారం మాట్లాడుతూ ఒడిశా రాష్ట్ర సరిహద్దులో ఉన్నందున పలాసలో గంజాయి లాంటి మత్తు పదార్ధాలకు యువత పెడదారి పడుతున్నారని, మత్తు పదార్ధాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.