విజయవాడలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి ఐస్ స్కేటింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన పలాసకు చెందిన జక్కల తోషినీరాయ్ జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించింది. మూడో తరగతి చదువుతున్న ఈ చిన్నారి ఈనెల 25 నుంచి 28 వరకు ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో జరిగే పోటీల్లో పాల్గొననుంది. 18 నుంచి 22 వరకు అక్కడే శిక్షణ శిబిరంలో పాల్గొంటుందని శిక్షకురాలు చంద్రావతి తెలిపారు.