పలాస రైల్వే స్టేషన్ సమీప ఆర్పీఎఫ్ పోలీస్ బేరక్స్ లో నాగుపాము మంగళవారం హల్ చల్ చేసింది. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వచ్చి చూసేసరికి నాగుపాము బుసలు కొడుతోంది. దానిని చూసి అతడు భయందోళనకు గురయ్యారు. అధికారులు వెంటనే ఈస్టర్న్ ఘాట్ వైల్డ్ లైఫ్ సొసైటీని సంప్రదించారు. స్నేక్ క్యాచర్ ఓంకార్ త్యాడి చేరుకుని నాగుపామును చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు.