పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషని మున్సిపల్ కమిషనర్ నడిపేన రామారావు మర్యాదపూర్వకంగా కలిశారు. పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల ప్రజలకు ఉద్దానం ప్రాజెక్ట్ నుంచి 5 ఎమ్ఎల్టి మంచినీటిని నిరంతరంగా సప్లై చేయటానికై జరుగుతున్న పైప్లాన్ల వర్క్ పనితీరుపై నివేదిక అందజేశారు. సాధ్యమైనంత తొందరగా ప్రాజెక్ట్ ద్వారా ప్రజలకు నిరంతరం మంచినీటిని అందించాలని ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు.