పలాస మున్సిపాలిటీలో భూ ఆక్రమణలపై టిడిపి శ్రేణులు తహశీల్దార్ కళ్యాణ చక్రవర్తికు బుధవారం ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో అత్యంత విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి విచ్చలవిడిగా అమ్మకాలు చేపట్టారని ఆరోపించారు. ఈ విషయంపై అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తు నిర్వహించి ఆక్రమణ దారుల నుండి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.