పలాస పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. పలాస - పూండి రైల్వే స్టేషన్ల మధ్య గురువారం ఓ మృతదేహం వెలుగులోకి వచ్చింది. జీఆర్పీ ఎస్ఐ ఎస్కే షరీఫ్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వయస్సు 45 నుంచి 50 ఏళ్లు ఉంటుందని పోలీసులు వివరించారు. వివరాలు తెలిస్తే 9440627567 నంబర్ను సంప్రదించాలన్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.