పలాస: బడ్జెట్ పత్రాలను దహనం చేసిన రైతులు

80చూసినవారు
కేంద్ర బడ్జెట్ వ్యవసాయ రంగానికి వ్యతిరేకంగా ఉందంటూ బుధవారం పలాస మండలం మాకన్నపల్లి గ్రామంలో జీడి రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర జీడి రైతు సంఘం కన్వీనర్ తెప్పల అజయ్ కుమార్ ఆధ్వర్యంలో బడ్జెట్ కాపీలను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. రాష్ట్ర వ్యవసాయ రంగానికి గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్లో ప్రతిపాదనలు తగ్గించడాన్ని ఆయన ఖండించారు.

సంబంధిత పోస్ట్