పలాస: లింగ నిర్ధారణ పరీక్షలు నేరం

55చూసినవారు
పలాస: లింగ నిర్ధారణ పరీక్షలు నేరం
పలాస ఆర్డిఓ ఆఫీసులో సబ్ డిస్టిక్ మల్టీ లెవెల్ అప్రూవడ్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీవో జీ వెంకటేష్ మాట్లాడుతూ లింగ నిర్ధారణ అనేది చట్టవిరుద్ధమైన నేరమని తెలిపారు. స్కానింగ్ సెంటర్లు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడవాలని సూచించారు. ప్రతి స్కానింగ్ సెంటర్‌లో గర్భిణీ మహిళల పేర్లు నమోదు చేయాలని చెప్పారు.  ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఎం అండ్ హెచ్ ఓ డా. తాడేల్ శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్