జీడి పరిశ్రమలు సోమవారం నుంచి తెరవకపోతే కాష్యూ అసోసియేషన్ హాల్ (పిసిఎంఎ) ముందు నిరవధిక ధర్నా చేపడతాతమని కాష్యూ లేబర్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు అంబటి కృష్ణమూర్తి, ఎన్.ఈశ్వరరావు ప్రకటించారు. స్థానిక యూనియన్ కార్యాలయంలో శుక్రవారం కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీడి పరిశ్రమల ఒడిదుడుకులు పేరుతో పరిశ్రమల యాజమానులు రెండు వారాలు బంద్ చేపడుతున్నట్లు యూనియన్‌కు గత నెల 29న లేఖ ఇచ్చారని తెలిపారు.