డా. బి. ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి మొగిలిపాడు లో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే గౌతు శిరీష సోమవారం ఆవిష్కరించారు. అనంతరం పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అదేవిధంగా కాశీబుగ్గ బస్టాండ్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.