ప్రస్తుతం ఐదు రూపాయలకు పెన్ను కూడా రావడం లేదని, కానీ సీఎం చంద్రబాబు అదే ఐదు రూపాయలకు అన్నం పెడుతున్నారని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. పేదవాడి ఆకలి తీర్చడమే టిడిపి ఆశయమని ఆమె తెలిపారు. పలాస లో అన్నా క్యాంటీన్ ను శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆమె స్వయంగా అల్పాహారాన్ని అందించారు.