పలాస :బొలెరో వాహనం ఢీకొనే వ్యక్తికి తీవ్ర గాయాలు

81చూసినవారు
పలాస మండలం కంబ్రిగాం గ్రామ సమీప జాతీయ రహదారి బ్రిడ్జి సర్వీస్ రోడ్లో శుక్రవారం డయాలసిస్ చేసుకొని తిరిగి వస్తున్న పేషెంట్ బాలకృష్ణని గుర్తుతెలియని బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని ఎడమ కాలు పూర్తిగా విరిగిపోయింది. విషయం తెలుసుకున్న హైవే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని అతడిని చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్