పలాస: జీడి రైతు సమస్యలపై ఎమ్మెల్యే శిరీషకు వినతి

80చూసినవారు
పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను రాష్ట్ర జీడి రైతు సంఘ సభ్యులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యే శిరీషకు జీడి రైతుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అనంతరం రాష్ట్ర రైతు సంఘ ఉపాధ్యక్షుడు కోనారి మోహనరావు మాట్లాడుతూ.. ఉద్దానంలో పండిస్తున్న జీడిపిక్కలకు మద్దతు ధర ప్రకటించి 80 కేజీల బస్తా రూ. 16 వేలకు ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేను కోరారు.

సంబంధిత పోస్ట్