పలాస: జీడి పంటకు మద్దతు ధర ఇవ్వాలి

77చూసినవారు
పలాస: జీడి పంటకు మద్దతు ధర ఇవ్వాలి
జీడి పంటకు మద్దతు ధర ప్రకటించి, జీడి బోర్డు ఏర్పాటు చేస్తామని ఎన్నికల సందర్భంగా టిడిపి నాయకులు జీడి రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎపి రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.మోహనరావు, జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ తెప్పల అజరు కుమార్‌ డిమాండ్‌ చేశారు. మండలంలోని బాతుపురంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా, ఎన్నికల్లో జీడి రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందన్నారు.

సంబంధిత పోస్ట్